మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 12:51:22

ఉద్య‌మంలో రామ‌లింగారెడ్డిది కీల‌క‌పాత్ర : మ‌ంత్రి కొప్పుల

ఉద్య‌మంలో రామ‌లింగారెడ్డిది కీల‌క‌పాత్ర : మ‌ంత్రి కొప్పుల

హైద‌రాబాద్ : తెలంగాణ ఉద్య‌మంలో దివంగ‌త ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి కీల‌క పాత్ర పోషించార‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ కొనియాడారు. రామ‌లింగారెడ్డి మృతిప‌ట్ల శాస‌న‌స‌భ‌లో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి కొప్పుల మాట్లాడారు.  రామ‌లింగారెడ్డి లేర‌నే విష‌యం కంట‌త‌డి పెట్టించింద‌ని పేర్కొన్నారు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే ఉండే నాయ‌కుడు అకాల మ‌ర‌ణం చెంద‌డం బాధ క‌లిగించింద‌న్నారు. విద్యార్థి ద‌శ నుంచే రామ‌లింగారెడ్డి ఉద్య‌మాల్లో పాల్గొన్నారు. జ‌ర్న‌లిస్టుగా ఆయ‌న అందించిన సేవ‌లు మ‌రువ‌లేనివి అని తెలిపారు. తెలంగాణ ఉద్య‌మంలో ఆయ‌న‌పై అనేక కేసులు పెట్టారు. టాడా కేసులో మూడు నెల‌ల పాటు రామ‌లింగారెడ్డి జైలు శిక్ష అనుభ‌వించారు. కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా ఆయ‌న ముందుండే వారు అని మంత్రి గుర్తు చేశారు.


logo