గురువారం 28 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 01:08:54

అనాథలకు ఇల్లు కట్టిచ్చిన కొప్పుల

అనాథలకు ఇల్లు కట్టిచ్చిన కొప్పుల

  • మాటిచ్చి.. నెరవేర్చిన మంత్రి
  • అన్నాచెల్లితో గృహప్రవేశం చేయించిన అమాత్యుడు 

ధర్మపురి: నిలువ నీడ లేని అనాథలకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అండగా నిలిచారు. ఇల్లు నిర్మిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చి.. కొత్తింట్లోకి గృహప్రవేశం చేయించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌కు చెందిన మామిడాల శ్రీకాంత్‌, శిరీషల తల్లి చిన్నప్పుడే మరణించగా.. తండ్రి దేవయ్య 2013లో అనారోగ్యంతో మృతిచెందాడు. తండ్రి మరణించే నాటికి శ్రీకాంత్‌ తొమ్మిది, శిరీష ఆరోతరగతి చదువుతున్నారు. శ్రీకాంత్‌ చదువు మానేసి ధర్మపురిలోని ఓ బేకరీలో పనిచేస్తూ చెల్లిని చదివిస్తున్నాడు. ఇల్లు లేక బంధువుల ఇండ్లలో ఉండేవారు. వీరి దీనస్థితిని తెలుసుకున్న మంత్రి.. తిమ్మాపూర్‌లో 151 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించా రు. ఎల్‌ఎం కొప్పుల చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఇంటిని నిర్మించారు. పనులు పూర్తవ్వడంతో శుక్రవారం శ్రీకాం త్‌, శిరీషలు మంత్రి సమక్షంలో గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికిలోనైన అన్నాచెల్లెళ్లు.. ఆనందబాష్పాలతో మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.  logo