బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 20:14:26

మాజీ మంత్రి నాయిని కుటుంబానికి మంత్రి పరామర్శ

మాజీ మంత్రి నాయిని కుటుంబానికి మంత్రి పరామర్శ

హైదరాబాద్‌ : దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం హైదరాబాద్‌లో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దామోదర్ పరామర్శించారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి ఆయన సతీమణి అహల్య చిత్రపటానికి కొప్పుల ఈశ్వర్, దామోదర్ గుప్తాలు పూలమాల వేసి ఘటించారు. వారిద్దరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, రోజుల వ్యవధిలో నాయిని దంపతులు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.