శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 22:32:35

‘కరోనా’పై మంత్రి కమలాకర్‌ ప్రెస్‌మీట్‌..

‘కరోనా’పై మంత్రి కమలాకర్‌ ప్రెస్‌మీట్‌..

కరీంనగర్‌: రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌.. ఇవాళ కరీంనగర్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరీంనగర్‌లో కరోనా ప్రభావం ఉందన్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. మిగితా వారిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని తెలిపారు. వారి వివరాలు రాగానే వెల్లడిస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో.. కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో 3-4 రోజులపాటు ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. 

పట్టణంలో వంద వైద్య బృందాలతో రేపు ఉదయం నుంచి ప్రతి ఇంటికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహిస్తామనీ, దయచేసి ప్రజలంతా వైద్యులకు సహకరించాలని మంత్రి తెలిపారు. మూడు, నాలుగు రోజుల పాటు అన్ని మతాల వారు ప్రార్థనా మందిరాలకు వెళ్లకూడదని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం కరోనాను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నందున ప్రజలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి విన్నవించారు. 


logo