గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 22:47:39

వెల్‌స్పర్‌ ఫ్లోరింగ్ కంపెనీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

వెల్‌స్పర్‌ ఫ్లోరింగ్ కంపెనీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

రంగారెడ్డి : చందన్ వల్లి పారిశ్రామిక పార్కులో ఏర్పాటు చేసిన వెల్‌స్పర్‌ ఫ్లోరింగ్‌ కంపెనీని మంత్రి కేటీఆర్‌ శనివారం సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కు నిర్మాణానికి రెండేళ్లుగా ప్రభుత్వం పరిశ్రమించిందని అన్నారు. ఇవాళ ప్రారంభించిన కంపెనీ ఇక్కడి ప్రగతికి ప్రారంభం మాత్రమే.. ఇంకా అనేక కంపెనీలు చందన్వల్లికి  రాబోతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వెల్‌స్పర్‌ గ్రూప్‌ ఆఫ్‌ సంస్థ 2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. మరో నాలుగు కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయని వెల్లడించారు. ఆయా సంస్థల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తామన్నారు. చందన్‌వల్లి పారిశ్రామిక పార్కులో అవసరమైన మౌలిక వసతులు, రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది.


logo