శనివారం 30 మే 2020
Telangana - May 02, 2020 , 13:41:27

మీర్‌బాగ్‌ కాలనీలో మంత్రి జగదీష్‌ రెడ్డి పర్యటన

మీర్‌బాగ్‌ కాలనీలో మంత్రి జగదీష్‌ రెడ్డి పర్యటన

నల్లగొండ : జిల్లా కేంద్రంలోని కంటైన్మెంట్‌ జోన్‌ మీర్‌బాగ్‌ కాలనీలో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి నేడు పర్యటించారు. క్షేత్రస్థాయిలో కలియతిరిగిన మంత్రి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో కరోనా అదుపులో ఉందన్నారు. గత 16 రోజులుగా కొత్త కేసు నమోదు కాలేదని తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తున్నారన్నారు. మరికొన్ని రోజులు ప్రజలు ఇదేవిధంగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. కొండల్‌రావు, జిల్లా సర్వెలెన్స్‌ అధికారి డా. రాహుల్‌, ఆర్‌డీవో జగదీశ్వర్‌ రెడ్డి, తహసీల్దార్‌ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.


logo