సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 09:59:00

నాయినికి నివాళులర్పించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

నాయినికి నివాళులర్పించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌ : మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి మరణం పట్ల రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. మంత్రుల నివాస ప్రాంగణంలో నాయిని పార్థీవ దేహాన్ని సతీమణి సునీతారెడ్డి కలిసి సందర్శించారు. భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతం నుంచి వచ్చి అంచెలంచెలుగా కార్మిక నాయకుడిగా ఎదిగారన్నారు. తొలి తెలంగాణ ప్రభుత్వంలో హోంమంత్రిగా, ఉద్యమ సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బాధ్యతలు పంచుకున్న నేతగా నాయిని అందించిన సేవలను, తనతో ఉన్న అనుబంధాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరని లోటని, ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కుటుంబ సభ్యులు మరింత ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.