శనివారం 30 మే 2020
Telangana - May 22, 2020 , 22:45:04

ముస్లింలకు మంత్రి జగదీశ్‌రెడ్డి రంజాన్‌ తోఫా

ముస్లింలకు మంత్రి జగదీశ్‌రెడ్డి రంజాన్‌ తోఫా

సూర్యాపేట : సూర్యాపేటలో సొంత వ్యయంతో 5 వేల మంది ముస్లిం సోదరులకు మంత్రి జగదీశ్‌రెడ్డి రంజాన్‌ తోఫా అందించేందుకు ఏర్పాటు పూర్తి చేశారు. డ్రై ఫ్రూట్స్‌ సహా ఇతర నిత్యావసర సరుకులను మంత్రి అందించనున్నారు. రంజాన్‌ పర్వదినం రోజున ఇంటింటికి చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఆంగ్లేయుల పాలనలో సైతం అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రం సర్వమత సమ్మేళనానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. మత సామరస్యాన్ని కాపాడంలో సీఎం కేసీఆర్‌ ఎన్నో చర్యలు చేపట్టినట్లు కొనియాడారు. logo