సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 11:08:02

గాంధీజీ అడుగుజాడ‌ల్లో నడుద్దాం: మ‌ంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

గాంధీజీ అడుగుజాడ‌ల్లో నడుద్దాం: మ‌ంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

హైద‌రాబాద్‌: మ‌హాత్ముని అడుగుజాడ‌ల్లో న‌డ‌వ‌డ‌మే గాంధీజీకి మ‌న‌మిచ్చే ఘ‌న‌మైన నివాళి అని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు. మ‌హాత్మాగాంధీ 151 జ‌యంతి సంద‌ర్భంగా సూర్యాపేట‌లో జాతిపిత‌ విగ్ర‌హానికి పూల‌మాల‌వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మ‌హాత్ముని అడుగుజాడ‌లో నేటి యువ‌త న‌డ‌వాల‌ని సూచించారు. అహింసామార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకువ‌చ్చిన మ‌హోన్న‌త వ్య‌క్తి  గాంధీజీ అన్నారు. 

సామాజిక రుగ్మ‌త‌లు లేకుండా దేశాన్ని అభివృద్ధిప‌థంలో న‌డిపేందుకు కృషిచేశార‌ని, సామాజిక మార్పు కోసం నిరంతరం శ్ర‌మించార‌ని చెప్పారు. అందుకే గాంధీజీని ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొలుస్తున్నార‌ని పేర్కొన్నారు. మ‌హాత్ముడు చూపిన బాట‌లో న‌డ‌వ‌డానికి ప్ర‌తిఒక్క‌రూ శాయ‌శ‌క్తులా కృషిచేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా గ్రంథాల‌య చైర్మ‌న్ శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ అన్న‌పూర్ణ‌, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిథులు, టీఆర్ఎస్ పార్టీ నేత‌లు పాల్గొన్నారు.    


logo