బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 01:29:21

నియంత్రిత సాగు మేలు

నియంత్రిత సాగు మేలు

  • విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

ఆత్మకూర్‌(ఎస్‌): నియంత్రిత సాగుతో రైతులకు మేలు జరుగుతుందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆశించిన దిగుబడికి, లాభసాటి వ్యవసాయానికి ప్రభుత్వం సూచించిన పం టలే వేయాలని కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నంద్యాలవారిగూడెంలో నియంత్రిత పంటల సాగుపై రైతులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలు తెలుసుకుని, వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. డిమాండ్‌ ఉన్న పంటల సాగుతో రైతులే గిట్టుబాటు ధర నిర్ణయించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ పాల్గొన్నారు. 


logo