గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 04, 2020 , 21:04:35

సివిల్స్‌ విజేతలకు మంత్రి జగదీశ్‌రెడ్డి శుభాకాంక్షలు

సివిల్స్‌ విజేతలకు మంత్రి జగదీశ్‌రెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : నేడు వెల్లడైన సివిల్స్‌-2019 ఫలితాల్లో ప్రతిభ చూపిన ఉమ్మడి నల్లగొండ జిల్లావాసులను రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రశంసించారు. సివిల్స్‌లో 218వ ర్యాంక్‌ సాధించిన చౌటుప్పల్‌ మండలం తంగేడుపల్లికి చెందిన బి. సత్య ప్రకాశ్‌ గౌడ్‌, 417 ర్యాంక్‌ సాధించిన నల్లగొండ పట్టణానికి చెందిన ఆర్‌. సీతల్‌ కుమార్‌, 46వ ర్యాంక్‌ సాధించిన చౌటుప్పల్‌కు చెందిన పి. ధాత్రి రెడ్డి, 244వ ర్యాంక్‌ సాధించిన హుజూర్‌నగర్‌కు చెందిన పి. సందీప్‌ వర్మకు మంత్రి హృదయపూర్వ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.logo