శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 00:48:00

లాభాల పంట పండించాలి

లాభాల పంట పండించాలి

  • విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట/యాదాద్రి భువనగిరి ప్రతినిధి, నమస్తేతెలంగాణ: రైతులు లాభాల పంట పండించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట,  భువనగిరిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి రైతు అవగాహన సదస్సుల్లో మంత్రి మాట్లాడుతూ.. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలన్నారు. పండించిన పంటలకు రైతులే ధర నిర్ణయించుకునేలా సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగుపై దృష్టి సారించారన్నారు.  

ఓట్ల రాజకీయం చేసేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేరని చెప్పారు. వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు, పెట్టుబడి, ధర.. ఇందులో మొదటి రెండింటిని ప్రభుత్వమే ఇస్తున్నందున మూడో అంశంలో రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఆయా  కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్లు గుజ్జ దీపిక, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


logo