మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 19:13:16

మంత్రి జగదీశ్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

మంత్రి జగదీశ్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

సూర్యాపేట :   రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో కలిసి సుఖసంతోషాల నడుమ నిర్వహించుకోవాలన్నారు. పాడి పంటలతో రాష్ట్రం మరింత తులతూగాలని ఆకాంక్షించారు.

అన్నదాతల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగుకు నిరంతర నాణ్యమైన విద్యుత్‌, రైతుబంధు,రైతుబీమా తదితర విప్లవాత్మక పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమనేత నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచి తెలంగాణ అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo