బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 18:33:48

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికే కఠోర నిర్ణయాలు...

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికే కఠోర నిర్ణయాలు...

నల్గొండ : ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా సురక్షితంగా ఉందని భావిస్తున్న తరుణంలో జిల్లాలోనూ పాజిటివ్ కేసులు ఉన్నట్లు తేలిందంటూ వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.  పాజిటివ్ వచ్చిన వారికి అందించాల్సిన చికిత్సల గురించి వాకబు చేశారు.  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్ ,యస్ పి ఏ వి రంగనాధ్ లతో పాటు డియంహెచ్ఓ కొండల్ రావుతో ఫోన్ లో సంప్రదించిన మంత్రి జగదీష్ రెడ్డి పాజిటివ్ గా తేలిన వారు ఇప్పటికే క్యారంటైన్ లో ఉన్నందున వారి వారి కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పి క్యారంటైన్ లకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.అంశం సున్నితమైనందున ఏ ఒక్కరినీ నొప్పించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...  మహమ్మారీ కరోనా వైరస్ ఇక్కడపుట్టింది కాదని,రాత్రికి రాత్రే వచ్చింది కాదని ఆయన చెప్పారు. ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహార్నిషలు శ్రమిస్తున్నారని అందుకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని  విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలంతా దీనిపై ఆందోళన చెందవద్దు అప్రమత్తంగా ఉండండని సూచించారు.  పాజిటివ్ వచ్చిన వారందరూ ప్రభుత్వ పర్వవేక్షణలోనే ఉన్నారు. వారికి అవసరమైన చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ  అంశం సున్నితమైనది...అవగాహన పెంచడంతోటే కట్టడి చేయవచ్చు.

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకే కఠోర నిర్ణయాలు తీసుకుంటున్నాం. మర్కజ్ వెళ్లి వచ్చిన వారందరూ వైద్యపరీక్షలకు స్వచ్చందంగా సహకరించాలి. వైరస్ వైరల్ కాకుండా చెయ్యాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. అందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.  అపోహలను దూరం చెయ్యండి...ఆరోగ్యాలను పరిరక్షించుకోండి. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రబలిన వైరస్ కాదు....అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ ఒకరి నుండి ఒకరికి సోకడానికి ఎంతో సేపు పట్టదని తెలిపారు. 


logo