గురువారం 02 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 16:45:29

వినియోగించిన విద్యుత్‌కే బిల్లు వచ్చింది: మంత్రి జగదీశ్‌ రెడ్డి

వినియోగించిన విద్యుత్‌కే బిల్లు వచ్చింది: మంత్రి జగదీశ్‌ రెడ్డి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచమంతా స్థంభించిపోయిందని మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు. గత మూడు నెలలుగా ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారని చెప్పారు. విద్యుత్‌ బిల్లు ఎక్కువగా వచ్చిందనే ఆందోళనల్లో వాస్తవం లేదని మంత్రి తెలిపారు. ఇవాళ మీడియా సమావేశంలో జగదీశ్‌ రెడ్డి మాట్లాడారు.  

'లాక్‌డౌన్‌ సమయంలో విద్యుత్‌ సంస్థల పని పెరిగింది. వేసవిలో కరెంట్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో విద్యుత్‌ వినియోగం బాగా పెరిగింది. లాక్‌డౌన్‌ వల్ల విద్యుత్‌ రీడింగ్‌ తీసేందుకు సిబ్బంది ఇండ్లకు వెళ్లలేదు. ఈఆర్‌సీ సూచనల మేరకు గత ఏడాది మార్చి, ఏప్రిల్‌ బిల్లులను ఈసారి వసూలు చేశాం. కరెంట్‌ బిల్లుల్లో రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదని'  మంత్రి పేర్కొన్నారు.

సరైన పద్ధతుల్లోనే బిల్లులు ఇచ్చాం. కరెంట్‌ ఎక్కువ వాడడం వల్ల కేటగిరీల్లో మార్పులు వచ్చాయి. విద్యుత్‌ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేటగిరీ మారడం వల్లే బిల్లులు అధికంగా వచ్చాయి. వినియోగదారులు వినియోగించిన విద్యుత్‌కే బిల్లు వచ్చింది. 3 నెలలకు కలిపి ఒకేసారి బిల్లు ఇవ్వడంతో ఎక్కువగా వచ్చినట్లు భావిస్తున్నారని జగదీశ్‌ రెడ్డి వివరించారు. logo