గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 16:40:03

మూసీ వంతెనను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి

మూసీ వంతెనను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ : గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామం వద్ద మూసీ కాలువపై ఉన్న వంతెన పై నుంచి పెద్ద ఎత్తున నీరు ప్రవహించింది. దీంతో మోత్కూర్ నుంచి నార్కట్‌పల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రహదారి నల్లగొండ-యాదాద్రి భువనగిరి జిల్లాలను కలిపే దారి కావున తక్షణమే తాత్కాలిక రోడ్డు నిర్మించి రాకపోకలు జరిగే విధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.logo