శనివారం 30 మే 2020
Telangana - May 10, 2020 , 22:21:51

సూర్యాపేట జిల్లా కేంద్రంలో 12 కూరగాయల మార్కెట్లు ప్రారంభం

సూర్యాపేట జిల్లా కేంద్రంలో 12 కూరగాయల మార్కెట్లు ప్రారంభం

సూర్యాపేట టౌన్‌ :  సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం 12చోట్ల ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లను మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..19 రోజులుగా సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని, 57 మంది డిశ్చార్జి కాగా మిగతా వారు కోలుకుంటున్నారన్నారు. త్వరలో సూర్యాపేట రెడ్‌ జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌గా మార్చే అవకాశం ఉందని తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందు కాకుండా సూర్యాపేటలో కూరగాయల మార్కెట్ల వికేంద్రీకరణ చేపట్టినట్లు మంత్రి చెప్పారు. 

ఈ సందర్భంగా మార్కెట్ల వద్ద వ్యాపారులు, ప్రజలకు మంత్రి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారయణ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo