శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:20:57

రైతులను దగా చేసిన కాంగ్రెస్‌

రైతులను దగా చేసిన కాంగ్రెస్‌

  • విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

ఆత్మకూర్‌.ఎస్‌: దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ  రైతాంగాన్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌ మాత్రం రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌.ఎస్‌, పెన్‌పహాడ్‌, చివ్వెంల మండల కేంద్రాలతోపాటు సూర్యాపేట మండలం టేకుమట్లలో రైతువేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 45 ఏళ్లుగా గోదావరి జలాల కోసం సూర్యాపేట జిల్లా ప్రజలు ఎదురుచూసి దగాపడ్డారన్నారు. తాము చెప్పిన ప్రకారం కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ పాల్గొన్నారు. logo