ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 14:41:26

కాంగ్రెస్ జల దీక్షలు సిగ్గు చేటు

కాంగ్రెస్ జల దీక్షలు సిగ్గు చేటు

నల్లగొండ : నిన్న కాంగ్రెస్ నేతల చేసిన జలదీక్షలు, ధర్నాలు నక్కల సంతాప సభల్లా ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని హాలియలో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ నాయకులే అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజలు సంతోషంగా జరుపుకుంటుంటే ధర్నాలు, దీక్షలు చేసి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ద్రోహులుగా మిగిలారన్నారు. నల్లగొండ రైతులు నాశనం అయ్యింది కాంగ్రెస్ నాయకుల చేతకానితనం వల్లనే అని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు పాపం ముమ్మాటికి కాంగ్రెస్ నాయకులదే నని  ఘాటుగా విమర్శించారు.

పదవుల కోసం సీమాంధ్ర నాయకులకు అమ్ముడుపోయిన నీచ చరిత్ర కాంగ్రెస్ నాయకులదని దుయ్యబట్టారు. జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డిలు అందరూ సీమాంధ్ర నాయకుల వద్ద మోకరిల్లి నల్గొండ జిల్లాను ఎండబెట్టారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దొంగ దీక్షలు, డ్రామాలను  ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ద్వంద వైఖరిని విడనాడాలని హితవు పలికారు.


logo