గురువారం 28 మే 2020
Telangana - May 23, 2020 , 09:00:44

ముస్లిం కుటుంబాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి నిత్యావసరాలు పంపిణీ

ముస్లిం కుటుంబాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి నిత్యావసరాలు పంపిణీ

సూర్యాపేట : రంజాన్‌ పర్వదినం సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలోని ముస్లిం కుటుంబాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి అండగా నిలిచారు. నియోజకవర్గంలోని 5 వేల కుటుంబాలకు మంత్రి ప్రత్యేకంగా తన సొంత నిధులతో బియ్యం, ఇతర నిత్యవసర సరుకుల గల ప్యాక్‌ను అందించారు. సూర్యాపేట పట్టణంలో, రాయినిగూడెం గ్రామంలో మంత్రి స్వయంగా వారి ఇండ్ల వద్దకే వెళ్లి సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ... రంజాన్‌ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు గుండూరి ప్రకాష్‌, ముస్లిం మతపెద్దలు, తదితరులు పాల్గొన్నారు.


logo