సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 12:09:21

తెలంగాణ‌తో ప్ర‌ణ‌బ్‌కు అవినాభావ సంబంధం : మ‌ంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

తెలంగాణ‌తో ప్ర‌ణ‌బ్‌కు అవినాభావ సంబంధం : మ‌ంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ ఉద్య‌మంతో మొద‌ట్నుంచి మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి అవినాభావ సంబంధం ఉంద‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతిప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ‌లో సంతాప తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా మంత్రి మాట్లాడారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. వారి పార్టీలో ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా ప్ర‌ణ‌బ్‌కే అప్ప‌గించేవారు. అదే విధంగా తెలంగాణ స‌మ‌స్య‌ను కూడా ఎప్పుడూ ప్ర‌ణ‌బ్‌కే అప్ప‌గించేవారు. తెలంగాణ బిల్లుపై ప్ర‌ణ‌బ్ సంత‌కం చేశారు. ప్ర‌ణ‌బ్‌ను చూసి అనేక విష‌యాలు నేర్చుకోవ‌చ్చు అని కేసీఆర్ అనేవారు అని మంత్రి తెలిపారు. కేసీఆర్‌ను ప్ర‌ణ‌బ్ ఎన్నోసార్లు ప్ర‌శంసించారు. ఒక ల‌క్ష్యం కోసం ప్రారంభించిన ఉద్య‌మాలు ప్ర‌పంచంలో అనేకం విజ‌య‌వంతం అయ్యాయి. ఒక ఉద్య‌మాన్ని ప్రారంభించి.. ల‌క్ష్యం సాధించిన కొంత‌మంది నాయ‌కుల్లో కేసీఆర్ ఒక‌రు అని ప్ర‌ణ‌బ్ అనేవారు అని మంత్రి గుర్తు చేశారు. ప్ర‌ణ‌బ్ దేశ చ‌రిత్ర‌లో నిలిచిపోతారు అని మంత్రి జ‌గదీశ్ రెడ్డి పేర్కొన్నారు. 


logo