శనివారం 28 నవంబర్ 2020
Telangana - Oct 26, 2020 , 21:22:17

మల్లన్న సన్నిధిలో మంత్రి జగదీశ్‌రెడ్డి, దేవులపల్లి ప్రభాకర్‌రావు

మల్లన్న సన్నిధిలో మంత్రి జగదీశ్‌రెడ్డి, దేవులపల్లి ప్రభాకర్‌రావు

శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను సోమవారం తెలింగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ దేవలపల్లి ప్రభాకర్‌రావు దర్శించుకున్నారు. శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్దకు చేరుకున్న వీరికి దేవస్థాన ఈఓ కేఎస్ రామారావు  స్వాగతం పలకగా.. ఆలయ అర్చకులు తిలకధారణ చేశారు. అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. 

ఆలయ ప్రాకార మండపంలో అర్చకులు, వేదపండితులు వేదాశీర్వచనాలు పలికారు. ఆలయ ఏఈఓ డీ మల్లయ్య.. స్వామివార్ల శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు, పరిమళ విభూదితోపాటు జ్ఞాపికను అందజేశారు. దర్శనానంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీశైల భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో  విద్యుదుత్పత్తి పున:ప్రారంభించిన సందర్భంగా ఎలాంటి ఆటంకాలు కలుగకుండా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగాలని స్వామివారికి మొక్కినట్లు తెలిపారు. వీరి వెంట విద్యుత్‌సౌధ సీఈ సీహెచ్ సురేశ్, డీఈ వెంకటేశ్వర్‌రెడ్డి, సివిల్ ఎస్ఈ రవీంద్ర, ఇతర అధికారులు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.