బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 12:38:56

టీఆర్‌ఎస్‌ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

టీఆర్‌ఎస్‌ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

జనగామ : త్వరలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం పనులు పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం జనగామలో నిర్మాణంలో ఉన్న టీఆర్‌ఎస్‌ భవన నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల చేతుల మీదుగా ప్రారంభింప చేస్తామన్నారు. కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యమైందని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ చలి కాలం కారణంగా విజృంభిస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. తగు జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారిని తరిమికొడుదామన్నారు.