శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 01:39:15

రాములోరి పెండ్లికి ఏర్పాట్లు

రాములోరి పెండ్లికి ఏర్పాట్లు
  • అధికారులతో సమీక్షించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
  • భక్తుల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించాలని ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీరామనవమి ఏర్పాట్లపై శుక్రవారం దేవాదాయశాఖ అధికారులతో అరణ్యభవన్‌లోని తన కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాములోరి పెండ్లి ఘనంగా నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఏప్రిల్‌ 1న ఎదుర్కోలు ఉత్సవం, 2న కల్యాణ మహోత్సవం, 3న మహాపట్టాభిషేకం కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, అదనపు కమిషనర్‌ శ్రీనివాస్‌రావు, ఈవో నర్సింహులు పాల్గొన్నారు.


logo