శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 11:12:45

కాళోజీ ఆశయ సాధనలో ముందుకువెళ్లాలి: మంత్రి ఇంద్రకరణ్

కాళోజీ ఆశయ సాధనలో ముందుకువెళ్లాలి: మంత్రి ఇంద్రకరణ్

హైద‌రాబాద్‌: ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నేడు కాళోజీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకున్నారు. తన యాస, భాషతో తెలంగాణ ఉద్యమానికి  కాళోజీ ఊపిరి పోశారని పేర్కొన్నారు. భాషను, సాహిత్యాన్ని, రాజకీయాలను, సంఘసంస్కరణలను ఉమ్మడిగా మేళవించి సమసమాజ నిర్మాణం కోసం జీవితాన్ని ధారపోశార‌ని చెప్పారు.  

తెలంగాణ రాష్ట్ర‌ అవిర్భావం తర్వాత కవులు, కళాకారులకు, సాహితీ వేత్తలకు గుర్తింపు లభించిందన్నారు. సీఎం కేసీఆర్ ప్ర‌జాక‌వి కాళోజీకి సముచిత గౌరవం కల్పించారని వెల్ల‌డించారు. కాళోజీ జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంద‌ని తెలిపారు.