గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 10:46:59

ఆడ‌బిడ్డ‌కు ప్ర‌భుత్వ కానుక బ‌తుక‌మ్మ చీర‌: మ‌ంత్రి అల్లోల‌

ఆడ‌బిడ్డ‌కు ప్ర‌భుత్వ కానుక బ‌తుక‌మ్మ చీర‌: మ‌ంత్రి అల్లోల‌

నిర్మల్: ఆడపడుచులంతా బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.317 కోట్ల వ్య‌యంతో కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలను ప్ర‌భుత్వం పంపిణీ చేస్తున్న‌ద‌న్నారు. రాష్ట్ర పండుగైన బతుకమ్మ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ కానుకగా చీరలు అందిస్తున్నామ‌ని, దీనికోసం 287కుపైగా డిజైన్ల చీరలు అందుబాటులో ఉంచామని తెలిపారు. మహిళలందరికి పెద్దన్నగా మారి సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగకు చీరలను ఇస్తున్నారని పేర్కొన్నారు. 18 ఏండ్లు నిండి, తెలుపురంగు రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి చీరలు అందిస్తున్నామని చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo