బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 12:39:15

ఉదయం 10 గంటల నుంచి ఉగాది పంచాంగ పఠనం

ఉదయం 10 గంటల నుంచి ఉగాది పంచాంగ పఠనం

హైదరాబాద్‌:  ప్రాణాంతక కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా  ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాలను  మూసివేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి దృష్ట్యా దేవాదాయశాఖ కార్యాలయంలో ఉగాది పంచాంగ పఠనం ఉంటుందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు  నిర్వహణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 

'రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తుల రద్దీ తగ్గింది. దేవాదాయశాఖ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఉగాది పంచాంగ పఠనం. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి ఉగాది పంచాంగ పఠనం వీక్షించాలని కోరుతున్నాం.  బహిరంగ వేడుకలు నిర్వహించొద్దని అధికారులను ఆదేశించాం.  కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులంతా సహకరించాలని కోరుతున్నాం. భద్రాద్రిలో యథావిధిగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తాం. కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తాం. కల్యాణ ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించలేదు.  ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వాళ్లకు తలంబ్రాలు పంపిస్తాం.  కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా భక్తులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని' మంత్రి విజ్ఞప్తి చేశారు.


logo
>>>>>>