గురువారం 02 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 10:55:24

పీవీ నరసింహారావుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి‌ నివాళి

పీవీ నరసింహారావుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి‌ నివాళి

హైదరాబాద్ : భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతిని పురస్కరించుకొని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పీవీకి నివాళుల‌ర్పించారు. పీవీ శతజయంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో తాను ఆదిలాబాద్‌ ఎంపీగా ఉన్నాను. 1993 లో పీవీ ప్రభుత్వం  మైనార్టీలో పడింది.

తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి పీవీ ప్రధాన మంత్రిగా ఉండటంతో రాజకీయాలకు అతీతంగా ఆయనకు మద్దతుగా నిల‌వాల‌నుకున్నాను. టీడీపీకి రాజీనామ చేసి మైనార్టీలో ఉన్న పీవీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ గ్రామీణాభివృద్ధిస్థాయి సంఘంలో నేను సభ్యునిగా ఉన్నప్పుడు గ్రామీణాభివృద్ధిపై ఆయనతో కలిసి పనిచేశాని గుర్తు చేశారు. 


logo