గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 19:04:15

అయ్యప్ప ఆలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు

అయ్యప్ప ఆలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు

నిర్మల్‌ :  జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయాన్ని ఆదివారం దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అర్చకులు, గురుస్వాములు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దగ్గరుండి ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం-2021 క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు.

ఆదివారం రాత్రి ఆలయంలో మహా మండలపూజ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో  ఆలయ ధర్మకర్తలు మురళీధర్ రెడ్డి దంపతులు,  జడ్పీ చైర్‌పర్సన్ విజయా రామ్‌కిషన్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్,  ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ కొండా సబితా శ్రీధర్, ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి, గురుస్వామి రాజన్ నంబూద్రి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo