గురువారం 16 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 13:37:09

అటవీ క్షేత్రాల రక్షణ అందరి బాధ్యత: ఇంద్రకరణ్‌ రెడ్డి

అటవీ క్షేత్రాల రక్షణ అందరి బాధ్యత: ఇంద్రకరణ్‌ రెడ్డి

ఆదిలాబాద్‌: అటవీ క్షేత్రాల రక్షణ మనందరి బాధ్యత అని, కలప అక్రమ రవాణాకు సంబంధించి అధికారులకు సమాచారం అందివ్వాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్‌లోని మావల పార్కులో పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మావల హరితవనం నుంచి చాందా-టీ వరకు రోడ్లకు ఇరువైపులా ఒకేరోజు లక్ష మొక్కలు నాటనున్నారు. 

హరితహారంలో ఐదు విడతలుగా నాటిన మొక్కల్లో 70 శాతం బతికున్నాయని చెప్పారు. ఆరో విడత హరితహారంలో 30 కోట్ల మొక్కలు నాటనున్నామని తెలిపారు. ఈసారి నాటే మొక్కల్లో 85 శాతం బతకాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాఠోడ్‌ బాపురావు పాల్గొన్నారు.


logo