గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 26, 2020 , 11:20:14

ఏఎస్పీ దక్షిణ మూర్తి మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం

ఏఎస్పీ దక్షిణ మూర్తి మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం

హైదరాబాద్ : జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణ మూర్తి ఆకస్మిక మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయ‌న ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని, ఆ భ‌గ‌వంతుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ప్రసాదించాల‌ని ప్రార్థించారు. నిర్మల్ అడిషనల్ ఎస్పీగా, ఉమ్మడి  వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో సుదీర్ఘంగా పని చేశారన్నారు. ముఖ్యంగా మేడారం జాతర స్పెషల్ ఆఫీసర్ గా సమర్థవంతంగా విధులు నిర్వహించారని ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.


logo