ఆదివారం 31 మే 2020
Telangana - May 01, 2020 , 08:39:17

కార్మికులకు మే డే శుభాకాంక్షలు: మంత్రి అల్లోల

కార్మికులకు మే డే శుభాకాంక్షలు: మంత్రి అల్లోల

హైదరాబాద్‌: అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కార్మిక లోకానికి మే డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.  కుల, మత, జాతి, ప్రాంతీయ భేదాలు మరచి ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక వేడుక మే డే ఆయన  ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమం అనేక పథకాలు చేపట్టిందన్నారు. కార్మికులు, వారి కుటుంబాల శ్రేయస్సు, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భ‌వ‌న నిర్మాణ కార్మికులు, సంఘ‌టిత‌, అసంఘ‌టిత కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు


logo