శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 12:35:09

సుహ‌ర్ష‌, సూర్య దీపిక‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి అభినంద‌న‌లు

సుహ‌ర్ష‌, సూర్య దీపిక‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి అభినంద‌న‌లు

హైద‌రాబాద్ : అమెరికాలోని ప్రతిష్ఠాత్మక అబర్న్ యూనివర్సిటీలో సీటు సాధించిన మంచిర్యాలకు చెందిన సుహర్ష, రంగారెడ్డి జిల్లాకు  చెందిన సూర్య దీపికాను రాష్ర్ట‌ అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు. సుహర్ష, సూర్య దీపికాతో మంత్రి నేడు ఫోన్ చేసి మాట్లాడారు. తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో బీఎస్సీ ఫారెస్ట్రీ కాలేజీలో చదివి   అబర్న్ యూనివర్సిటీలో సీట్ సాధించడం తమకెంతో గర్వంగా ఉందన్నారు.  మీరు సాధించిన ఈ ఘనత మరింత మంది విద్యార్థులకు ప్రేరణ ఇస్తుందన్నారు.

భవిష్యత్తులో కూడా ప్రభుత్వం తరపున అన్ని రకాల సహకారాలు అందిస్తామని వారికి భరోసానిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అటవీ విద్యలో ఉన్నత విద్యను అభ్యసించి ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో  విద్యను అందించి, వారి ఎదుగుదలకు కృషి చేస్తున్న ఎఫ్‌సీఆర్ఐ డీన్ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బందికి ఈ సంద‌ర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు.


logo