మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 17:41:31

బొమ్మెర వెంకటేశం మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం

బొమ్మెర వెంకటేశం మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం

హైదరాబాద్ : కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మెర వెంకటేశం మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఆలయం అభివృద్ధికి చైర్మన్ గా వెంకటేశం ఎంతో కృషి చేశారని మంత్రి ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.


logo