శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 13:01:26

ఏఎస్పీ దక్షిణామూర్తికి నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఏఎస్పీ దక్షిణామూర్తికి నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ : అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. మామడ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పోలీసులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..విధి నిర్వహణలో దక్షిణామూర్తి అంకిత భావంతో పని చేశారన్నారు. ముఖ్యంగా మేడారం జాతర విధుల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కరోనాతో దక్షిణామూర్తి చనిపోవడం బాధాకరమన్నారు.


logo