మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 23, 2020 , 18:03:29

గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

సిద్దిపేట : జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ వంగ లక్ష్మి అధ్యక్షతన గ్రామ పంచాయతీ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి సమక్షంలో గ్రామ సర్వతోముఖాభివృద్ధికి ఆరు తీర్మానాలను  సర్పంచ్  ప్రతిపాదించారు. ప్రతిపాదనలకు పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కాగా, రాష్ట్రంలోనే గ్రామ పంచాయతీ సమావేశానికి హాజరైన మొదటి మంత్రిగా హరీశ్ రావు రికార్డు సృష్టించారు.


logo