ఇటీవల సెలబ్రిటీల రెండో పెళ్లిపై తెగ వార్తలు వస్తున్నాయి. అప్పట్లో రేణూ దేశాయ్ రెండో పెళ్లికి సంబంధించి కొద్ది రోజుల పాటు వార్తలు దావానంలా వ్యాపించాయి. ఇక రీసెంట్గా సురేఖా వాణి రెండో పెళ్లిపై కూడా వార్తలు వచ్చాయి. వాటిని సురేఖా కొట్టి పారేసింది. ఇక తాజాగా సీనియర్ నటి ప్రేమ రెండో పెళ్లి చేసుకోనుందంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది ప్రేమ. ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది.
ప్రస్తుతం నేను ఒంరటిగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నను. నా ఆరోగ్యంపై కూడా అనేక రూమర్స్ వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానంటూ అభిమానులకి క్లారిటీ ఇచ్చింది. ప్రేమ 2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పచ్చుని పెళ్లి చేసుకోగా, పదేళ్ల కాపురం తరువాత, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2016లో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు.