మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 11:19:57

మున్సిపల్ చైర్మన్ ను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి

మున్సిపల్ చైర్మన్ ను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి

నిర్మల్ : నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ నిన్న రాత్రి గాంధీ చౌక్ లో రోడ్డు వెడల్పు పనులను పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ పై నుంచి కిందపడి గాయపడ్డారు. మంగళవారం ఉదయం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  ప్రియదర్శిని నగర్ లోని చైర్మన్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి వెంట ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డీసీసీబీ చైర్మన్ రాం కిషన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.


logo