శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 18:13:26

భానుమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి

భానుమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన  మంత్రి ఐకే రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ అర్చక, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు గంగు భానుమూర్తి కుటుంబ సభ్యులను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. నల్లకుంటలోని భానుమూర్తి నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అర్చకులు, ఆలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేశారన్నారు. అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ప్రకటించడంలో భానుమూర్తి కృషి మరువలేనిదని ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.


logo