శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 23, 2020 , 15:33:20

శివకోటి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

శివకోటి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

నిర్మల్ : నిర్మల్ పట్టణం బుధవార్ పేట్ చౌరస్తాలోని శివకోటి మందిర నిర్మాణ పనులను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివకోటి మందిరాన్నిరూ.55 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్నామన్నారు. త్వరలోనే ఆలయ పనులు పూర్తి చేస్తామన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము, కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పూదరి నరహరి, జగడం రాజు, మారుగొండ నరేందర్, డి.శ్రీనివాస్, బద్రి శ్రీను, పూదరి నరేందర్, బిట్టు తదితరులు పాల్గొన్నారు.


logo