మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 13:30:03

పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి

పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి

నిర్మల్ : జిల్లాలోని దీలవార్ పూర్ మండలం న్యూ లోలం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని గురువారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీతో కలిసి ప్రారంభించారు. అనంతరం వనం ఆవరణలో పంచ మొక్కలు( రాగి మర్రి, జువ్వి, వేప,పత్రి ) నాటి ప్రకృతి వనాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 552 పల్లె ప్రకృతి వనాలను 100 % పూర్తి చేశామన్నారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రం లో 12,720 వేలకు పైగా ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంలో 33% దాటిందని భవిష్యత్ లో 40% పచ్చదనాన్ని చేరువవుతామని పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయితీకి 10% నిధులను ప్రభుత్వం కేటాయిస్తోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లోలం సవిత, ఎంపీపీ ఎలాల అమృత, పీడీ డీఆర్డీఏ వెంకటేశ్వర్ రావు, జడ్పీ కో ఆప్షన్ సుభాష్ రావు, పార్టీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.logo