మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 16:45:30

యాదాద్రిలో మంత్రి హరీశ్‌రావు పూజలు

యాదాద్రిలో మంత్రి హరీశ్‌రావు పూజలు

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మి స్వామివారిని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ప్రత్యేక ఆశీర్వచనం తీర్థ ప్రసాదం అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, ఆలయ ఈఓ గీత, ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహా చార్యులు, మున్సిపల్ చైర్ పర్సన్ సుధ, జెడ్పీటీసీ అనురాధ, తదితరులు ఉన్నారు.logo