సోమవారం 25 మే 2020
Telangana - Feb 19, 2020 , 14:58:26

శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు

శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు

మెదక్ : రాష్ట్ర్రవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మెదక్ జిల్లాలోని రామాయంపేటలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి.. చత్రపతి శివాజీకి నివాళులర్పించారు. 



logo