మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 12:19:34

నిరాడంబరతను చాటుకున్న మంత్రి హరీశ్‌ రావు

నిరాడంబరతను చాటుకున్న మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట : మంత్రి హరీశ్‌ రావు అంటే సామాన్య నాయకుడని మరోసారి నిరూపించారు. ఏ హోదాలో ఉన్నా నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారిలో ఒకడిగా కలిసిపోతూ సమస్యలను పరిష్కరించడం ఆయన నైజం. దుబ్బాకలో మరో సారి తన నిరాడంబతరను మంత్రి చాటుకున్నారు. ఒక సామాన్యుడిగా దుబ్బాక బస్టాండ్ సర్కిల్‌లో చాయ్ తాగి ముచ్చటించారు. ‘దుబ్బాకలో ఈ చాయ్ డబ్బా ఫేమస్ ఆట కదా.. నీ దగ్గర చాయ్ బాగుంటుందట..! ఓ చాయ్‌ పొయ్‌ తాగుతా అంటూ చాయ్ తాగుతూ.. చాయ్ కొట్టు అతనితో ఆత్మీయంగా మాట్లాడారు’. అక్కడ ఉన్న యువతతో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. అందరిని ఆప్యాయంగా పలకరించి మరో సారి తను సిసలైన ప్రజానాయకుడని రుజువు చేశారు.