గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 25, 2020 , 12:32:49

తెలంగాణ అత్యంత వేగంగా పురోగ‌తి : మ‌ంత్రి హ‌రీష్ రావు

తెలంగాణ అత్యంత వేగంగా పురోగ‌తి : మ‌ంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట : ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టం అత్యంత వేగంగా పురోగతి సాధిస్తుంద‌ని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. ఈ ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప్ర‌జా సంక్షేమం, అభివృద్ధి దిశ‌గా ప్ర‌భుత్వం అన్నింటా విజ‌యాలు సాధించాల‌ని అమ్మ‌వారిని వేడుకున్నాన‌ని తెలిపారు. ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో సిద్దిపేటలోని రంగదాంపల్లి హనుమాన్ దేవాలయంలో, ప్రశాంత్ నగర్ హనుమాన్ దేవాలయంలో, నర్సాపూర్ జమ్మి హనుమాన్ దేవాలయంలో, ఇమామ్ బాద్ శ్రీ దుర్గా మాత విగ్రహ నిమర్జన కార్యక్రమంలో మంత్రి హ‌రీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ఈ పర్వదినాన్ని ప్రజలంద‌రూ సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. చెడు మీద మంచి విజయం సాధించే రోజు విజయ దశమి అని మంత్రి పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు  దసరా పండుగ మరిన్ని విజయాలు అందించాలని హ‌రీష్ రావు కోరుకున్నారు.