గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 16:48:58

మాన‌వ‌త్వాన్ని చాటుకున్న మంత్రి హ‌రీష్ రావు

మాన‌వ‌త్వాన్ని చాటుకున్న మంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట : రాష్ర్ట ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు మ‌రోసారి మాన‌వ‌త్వం చాటుకున్నారు. మాసాయిపేట వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై దౌల్తాబాద్ నుంచి హైద‌రాబాద్‌కు హ‌రీష్ రావు త‌న కారులో వెళ్తున్నారు. ఆ స‌మ‌యంలో అదే ర‌హ‌దారిపై ఇద్ద‌రు యువ‌కులు బైక్‌పై వెళ్తుండ‌గా.. బైక్ స్కిడ్ అయింది. ఈ ప్ర‌మాదాన్ని గ‌మ‌నించిన హ‌రీష్ రావు త‌క్ష‌ణ‌మే త‌న వాహ‌నాన్ని ఆపారు. హ‌రీష్ రావు కారు దిగి.. గాయ‌ప‌డ్డ యువ‌కుల వ‌ద్ద‌కు వెళ్లి ప‌రామ‌ర్శించారు. యువ‌కులిద్ద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని స్థానిక ఎస్ఐని హ‌రీష్ రావు ఆదేశించారు. మెరుగైన వైద్యం అందేలా చూడాల‌ని చెప్పారు.