బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 17:34:09

ధ‌ర‌ణి రిజిస్ర్టేష‌న్ల ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించిన మంత్రి హ‌రీష్ రావు

ధ‌ర‌ణి రిజిస్ర్టేష‌న్ల ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించిన మంత్రి హ‌రీష్ రావు

సంగారెడ్డి : జిల్లా ప‌రిధిలోని కంది త‌హ‌సీల్దార్ ఆఫీస్‌ను రాష్ర్ట ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ఆకస్మికంగా త‌నిఖీ చేశారు. ధ‌ర‌ణి రిజిస్ర్టేష‌న్ల ప్ర‌క్రియ‌ను ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ లో వేగం పెరిగింది అని తెలిపారు. రిజిస్ర్టేష‌న్ కాగానే మ్యుటేష‌న్ జ‌రిగిపోతుండ‌టంతో చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యాయ‌ని పేర్కొన్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారా రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. 

చెరుకు రైతుల స‌మ‌స్య‌ల‌పై మంత్రి స‌మీక్ష‌

సంగారెడ్డి క‌లెక్ట‌రేట్‌లో అధికారుల‌తో రాష్ర్ట ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు స‌మీక్ష నిర్వ‌హించారు. ప‌త్తి, మొక్క‌జొన్న‌, ధాన్యం కొనుగోళ్ల‌పై స‌మీక్ష చేశారు. జ‌హీరాబాద్ చెరుకు రైతుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావించారు. జ‌హీరాబాద్ రైతుల‌తో ట్రైడెంట్ షుగ‌ర్ ప‌రిశ్ర‌మ ఒప్పందం చేసుకోలేదు. దీంతో జ‌హీరాబాద్‌లో పండిన చెరుకును సంగారెడ్డి గ‌ణ‌ప‌తి షుగ‌ర్ ప‌రిశ్ర‌మ‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. సంగారెడ్డి రైతుల‌కు చెల్లించే ధ‌ర‌నే జ‌హీరాబాద్ రైతుల‌కు వ‌ర్తింప‌జేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. చెరుకు రైతుల బ‌కాయిలు చెల్లించాల‌ని ట్రైడెంట్ ప‌రిశ్ర‌మ‌ను ఆదేశించారు. బ‌కాయిలు చెల్లించ‌క‌పోతే చ‌ట్టం ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుందని మంత్రి హెచ్చ‌రించారు.