సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 14:49:58

ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి హరీశ్ రావు

ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి : జిల్లాలో భారీ వర్షాలతో జలమయంగా మారిన కాలనీలు, ముంపు ప్రాంతాలను ఆర్థిక శాఖ  మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలోని లాల్ సాబ్ గడ్డ, నారాయణరెడ్డి కాలనీల్లో పర్యటించారు. కలెక్టర్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ అధికారులతో కలిసి పరిస్తితిని సమీక్షించారు. వరద నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్ ను అదేశించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రనిధులు ఉన్నారు.logo