బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 16:54:44

మ‌ంత్రి హ‌రీశ్‌రావు బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు

మ‌ంత్రి హ‌రీశ్‌రావు బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు

సిద్దిపేట : గోదావరి జలాలతో బతుకమ్మ పండుగ చేసుకుంటాం అన్న మాటను నిజం చేశామని రాష్ర్ట ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. ఈ ఏడాది కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్న చెరువుల్లో బతుకమ్మ పండుగ జరుపుకుంటునందుకు సంతోషంగా ఉంద‌ని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాల‌న్నారు. జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ బ‌తుక‌మ్మ పండుగ‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. అలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉందన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. బతుకమ్మ పండుగ వచింది అంటే ట్యాంకర్లతో నీళ్లు నింపి బతుకమ్మలు వేసే పరిస్థితి ఉండే. కానీ నేడు మ‌న సీఎం కేసీఆర్ కృషితో కాళేశ్వరం జలకళతో  నిండు కుండల్లా, మత్తల్లు దుంకుతున్న చెరువుల్లో బతుకమ్మ వేసుకునే రోజులు వచ్చాయన్నారు.