హైదరాబాద్ : తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో మంత్రి హరీష్ రావు.. సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. సూపర్ స్ప్రెడర్లకు టీకాల పంపిణీ విధివిధానాలపై హరీష్ రావు అధికారులతో చర్చిస్తున్నారు. వైరస్‌ను వ్యాపింపజేసే అవకాశమున్న సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.